Mon Dec 23 2024 00:49:00 GMT+0000 (Coordinated Universal Time)
సర్కార్ కుప్పకూలినట్లేనా?... 24 గంటల సమయమేనా?
శివసేన అసంతృప్త ఎమ్మెల్యేలు రోజురోజుకూ పెరుగుతున్నారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు సూరత్ నుంచకి అసోంకు బయలుదేరి వెళ్లారు
శివసేన అసంతృప్త ఎమ్మెల్యేలు రోజురోజుకూ పెరుగుతున్నారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు సూరత్ నుంచకి అసోంకు బయలుదేరి వెళ్లారు. గుజరాత్ నుంచి అసోంకు క్యాంప్ మార్చారు. అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రత్యేకంగా దూతలను ఎమ్మెల్యేల వద్దకు పంపారు. బయట వారు ఎవరిని కలవకుండా క్యాంప్ ల వద్ద పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. శివసేన ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ఎవరిని అనుమతించడం లేదు. అసంతృప్త నేత ఏక్నాధ్ షిండే తో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఫోన్ లో 20 నిమిషాలు మాట్లాడినా ఫలితం లేదు. బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏక్నాధ్ షిండే కోరారు.
మంత్రివర్గ సమావేశం...
మొత్తం నలభై మంది ఎమ్మెల్యేలు ఉండటంతో తాను శివసేన తరుపున గవర్నర్ కు లేఖ ఇస్తానని ఏక్నాధ్ షిండే తెలిపారు. ముంబయి వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. తాను బాల్ ధాక్రే సిద్ధాంతాలు, ఆశయాలను వదిలిపెట్టబోనని చెబుతున్నారు. మరోవైపు ఈరోజు మహారాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
గవర్నర్ కు లేఖ...
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా ఇటీవల ఒక శాసనసభ్యుడు మరణించారు. మ్యాజిక్ ఫిగర్ 144 గా ఉంది. మహా వికాస్ అఘాడీ కి వాస్తవానికి 168 సభ్యుల బలం ఉంది. ఇప్పుడు దాదాపు 36 మంది శివసేన ఎమ్మెల్యేలు షిండేతో ఉన్నారంటున్నారు. అదే జరిగితే 132 మాత్రమే మహా వికాస్ అఘాడీ బలం అవుతుంది. 113 మంది సభ్యులున్న బీజేపీ కూటమితో శివసేన అసంతృప్త ఎమ్మెల్యేలు చేరితే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాుటు చేయవచ్చు. ఈరోజు రేపట్లో గవర్నర్ కు షిండే లేఖ అందజేయనున్నట్లు సమాచారం. మరో 24 గంటల్లో మహారాష్ట్రంలోని మహా వికాస్ అఘాడీ సర్కార్ కూలిపోతుందన్న అంచనాలు విన్పిస్తున్నాయి. అందుకు అనుగుణంగా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు..
Next Story