శివాజీ మళ్లీ వచ్చాడ్రోయ్…!
డేటా చోరీ అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి తప్పూ చేయలేదని, అధికార పార్టీ ప్రజల వివరాలను వాడుకోవడంలో తప్పు లేదని నటుడు శివాజీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన [more]
డేటా చోరీ అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి తప్పూ చేయలేదని, అధికార పార్టీ ప్రజల వివరాలను వాడుకోవడంలో తప్పు లేదని నటుడు శివాజీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన [more]
డేటా చోరీ అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి తప్పూ చేయలేదని, అధికార పార్టీ ప్రజల వివరాలను వాడుకోవడంలో తప్పు లేదని నటుడు శివాజీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన డేటా చోరీ వ్యవహారంపై మీడియాతో మాట్లాడుతూ… దేశ రహస్యాలు, సరిహద్దు, సైన్యం, పోలీసులకు సంబంధించిన రహస్యాలు చోరీ చేస్తే డేటా చోరీ అంటారని, దీనిని డేటా చోరీ అనరని తెలిపారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అంశాలను మరిపించడానికి కుట్రలో భాగంగానే బీజేపీ కేసీఆర్ తో కలిసి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందని ఆరోపించారు. తెలంగాణ వేసిన సిట్ చంద్రబాబును దొంగ అనకుండా దొర అని చెబుతారా అని ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఐటీ గ్రిడ్ యాజమాని అశోక్ పోలీసులకు దొరుకుతాడని, ఎన్నికలకు పది రోజుల ముందు చంద్రబాబు డేటా చోరీ చేశాడని సిట్ నివేదిక ఇస్తుందని శివాజీ జోస్యం చేశారు.
హైదరాబాద్ లో భయపడుతూ బతుకుతున్నారు…
సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 2015 నుంచే తెలంగాణలో డేటా చోరీ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇంటి పేర్ల ఆధారంగా తెలంగాణలో ఓట్లు తలగించారని ఆరోపించారు. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారని తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలన్నారు. డేటా చోరీ చేసిందే హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా వాళ్లు భయపడుతూ బతుకుతున్నారని, కేసీఆర్ కు ఆంధ్రా సెటిలర్లు భయపడాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అని తెలిపారు. ‘‘ఆంధ్రోడు దొంగ అని అంటారా.? నా అన్నాన్ని తిట్టారు.. నా బిర్యానీని తిట్టారు… నా బిర్యానీ పేడలా ఉంటుందా’’ అంటూ పాత విషయాలు చెప్పి సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు కష్టాలు వచ్చినప్పుడల్లా తాను వస్తానన్నారు. ప్రత్యేక హోదా అంశం పార్టీలు ఎత్తుకున్నాయంటే కారణం తానే అన్నారు. చుక్కల భూముల అంశాన్ని తాను పరిష్కరించానన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక శివాజీ వారిపై చిందులు వేశారు.