Mon Dec 23 2024 03:42:19 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు ప్రయత్నాలను ఎద్దేవా చేసిన శివసేన
కేంద్రంలో ఎన్డీఏ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలను శివసేన ఎద్దేవా చేసింది. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నారని, లోక్ [more]

కేంద్రంలో ఎన్డీఏ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలను శివసేన ఎద్దేవా చేసింది. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నారని, లోక్ సభ స్థానాలు కూడా ఎక్కువ గెలవరని శివసేన పత్రిక ‘సామ్నా’లో పేర్కొంది. స్వంత రాష్ట్రంలో గెలవలేని చంద్రబాబు ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారని ఆ పార్టీ పేర్కొంది. స్మశానంలో బూడిద పోగు చేసినట్లుగా చంద్రబాబు ప్రయత్నాలు ఉన్నాయని ఎద్దేవా చేసింది. ఎన్డీఏ కచ్చితంగా 300కు పైగా సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది.
Next Story