సింహాచలం ఈవోపై వేటు
సింహాచలం ఈవో వెంకటేశ్వరరావు ను మాతృ శాఖ కు సరెండర్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమాలకు పాల్పడ్డారంటూ దేవదాయ శాఖ కమిషనర్‌కు ఇటీవలే నివేదిక [more]
సింహాచలం ఈవో వెంకటేశ్వరరావు ను మాతృ శాఖ కు సరెండర్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమాలకు పాల్పడ్డారంటూ దేవదాయ శాఖ కమిషనర్‌కు ఇటీవలే నివేదిక [more]
సింహాచలం ఈవో వెంకటేశ్వరరావు ను మాతృ శాఖ కు సరెండర్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమాలకు పాల్పడ్డారంటూ దేవదాయ శాఖ కమిషనర్‌కు ఇటీవలే నివేదిక అందింది. దేవాదాయశాఖ ఎస్టేట్ అధికారి ఆజాద్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సింహాచలంపై కొండపై భారీ స్థాయిలో అక్రమ క్వారీయింగ్ కు సహకరించారని ఈవోపై అభియోగాలున్నాయి. రికార్డులను తారుమారు చేశారని ఆరోపణలను కూడా వెంకటేశ్వరరావు ఎదుర్కొంటున్నారు. నిషేధం ఉన్నా.. కొత్త పనులకు ఈవో వెంకటేశ్వరరావు టెండర్లు పిలిచారని నివేదికలో పేర్కొన్నారు. అయిపోయిన పనులకూ టెండర్లు పిలిచారని నివేదికలో వెల్లడించారు. దీంతో వెంకటేశ్వరరావును సాధారణ పరిపాలన శాఖ కు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయనపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ భ్రమరాంభకు సింహాచలం ఈవో గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.