బ్రేకింగ్ : ఊపిరి ఆగిపోయింది…. పీల్చుకునే సమయంలోనే?
విశాఖపట్నంలో పరిస్థితి భయానకంగా ఉంది. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో గ్యాస్ లీక్ అయినట్లుగా చెబుతున్నారు. నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కి పడ్డారు. ఊపిరి ఆడకపోవడంతో బయటకు [more]
విశాఖపట్నంలో పరిస్థితి భయానకంగా ఉంది. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో గ్యాస్ లీక్ అయినట్లుగా చెబుతున్నారు. నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కి పడ్డారు. ఊపిరి ఆడకపోవడంతో బయటకు [more]
విశాఖపట్నంలో పరిస్థితి భయానకంగా ఉంది. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో గ్యాస్ లీక్ అయినట్లుగా చెబుతున్నారు. నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కి పడ్డారు. ఊపిరి ఆడకపోవడంతో బయటకు పరుగులు తీశారు. బయటకు వచ్చిన వారు వచ్చినట్లే స్పృహ తప్పి పడిపోయారు. కొందరు రోడ్డు మీదనే మృతి చెందారు. లాక్ డౌన్ తో ఇప్పటి వరకూ ఎల్జీ పాలిమర్స్ పనిచేయలేదు. ప్రభుత్వం అనుమతివ్వడంతో నేటి నుంచి పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే రాత్రి నుంచి పరిశ్రమలో పనులు ప్రారంభమయ్యాయి.
నైపుణ్యంలేని కార్మికుల వల్లనే….
ఈ పరిశ్రమలో నైపుణ్యం లేని కార్మికుల వల్లనే విషవాయువు లీక్ అయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు రెండు వేల మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరికి కళ్లు కన్పించడం లేదు. చర్మం మీద దుద్దుర్లు లేచాయి. పరిశ్రమ ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. జగన్ ఇప్పటికే అధికారులతో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో జగన్ విశాఖకు బయలుదేరి వెళ్లనున్నారు. గ్రామాలను ఖాళీ చేయించిన అధికారులు వారికి వేరే చోట బస ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద విశాఖలో ఈ దుర్ఘటన జరగడం అత్యంత బాధాకరం. మూగజీవాలు వేల సంఖ్యలో మరణించాయి.