big breaking ఏపీలో ఘోర రైలు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మృతులు పెరిగే అవకాశం
విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ - రాయగడ ప్యాసింజర్ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కంటకాపల్లి దగ్గర ఈ రైలు పట్టాలు తప్పింది. ఓవర్హెడ్ కేబుల్ తెగిపోవడంతో నిలిచిపోయిన ప్యాసింజర్ రైలును పలాస-విశాఖ రైలు ఢీకొట్టగా మూడు బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది.
విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ - రాయగడ ప్యాసింజర్ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కంటకాపల్లి దగ్గర ఈ రైలు పట్టాలు తప్పింది. ఓవర్హెడ్ కేబుల్ తెగిపోవడంతో నిలిచిపోయిన ప్యాసింజర్ రైలును పలాస-విశాఖ రైలు ఢీకొట్టగా మూడు బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని వాల్తేరు డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఘటన ప్రాంతంలో పూర్తిగా చీకటి ఏర్పడటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నట్లు ఆయన వెల్లడించారు.