Sun Nov 17 2024 17:33:29 GMT+0000 (Coordinated Universal Time)
DeepFake Video : డీప్‌ఫేక్ ఆగడాలకు అసలు కారణం వారే.. ముందు వాళ్ళు మారాలి..
డీప్‌ఫేక్ ఆగడాలకు అసలు కారణం ఎవరో తెలుసా..? ముందు వాళ్ళు కొంచెం బాధ్యతగా వ్యవహరిస్తే..
DeepFake Video : రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా పెద్ద చర్చినీయాంశం అయ్యింది. రష్మిక తరువాత కాజోల్, అలియా భట్.. ఇలా కొనసాగుతూనే ఉంది. ఆ డీప్‌ఫేక్ ఆగడాలను అడ్డుకోకపోతే భవిషత్తులో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందంటూ సినీ, రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ డీప్‌ఫేక్ సమస్య ఏమి ఇప్పటిది కాదు. గతంలోనూ ఇలాంటివి చాలా జరిగాయి. అయితే అప్పుడు పోర్న్ స్టార్స్ ఫోటోలు, వీడియోలతో డీప్‌ఫేక్ లు చేసేవారు.
ఆ మార్ఫ్ వీడియో, ఫోటోలు కూడా అడల్ట్ సైట్స్ లోనే కనిపించేవి. ఆ డీప్‌ఫేక్ కంటెంట్ తో బాధపడినవారు చాలామందే ఉన్నారు. ఇప్పటి స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ చిన్నతనంలోనే తన మార్ఫ్ వీడియో అడల్ట్ సైట్ లో కనిపించడంతో.. తనతో చదువుకునే వారి నుంచే అనేక కామెంట్స్ ని ఎదుర్కొన్నట్లు ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే అడల్ట్ సైట్ లో వచ్చిన మార్ఫ్ కంటెంట్ పై కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకోని వాటిని తొలిగించేది.
అయితే ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ కూడా రానురాను అడల్ట్ సైట్స్ గా మారిపోతుంది. కొందరు తమ టాలెంట్ ని చూపించుకోవడానికి సోషల్ మీడియాని ఉపయోగించుకుంటుంటే.. మరికొంతమంది మాత్రం హద్దులు దాటి ప్రవర్తిస్తూ భాద్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటూ.. నెట్టింట శృతిమించిన అందాల ఆరబోతతో హద్దులు దాటుతున్నారు.
మగవాళ్ళు అంటే ఇలానే ఉండాలి, ఆడవాళ్లు అంటే ఇలాగే డ్రెస్ వేసుకోవాలని రూల్స్ ఏమి లేవు. కానీ మన ప్రవర్తనతో ఎదుటవారికీ ఇబ్బంది కలుగుతుందనే విచక్షణ ఉండాలి. కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. శృతిమించిన స్కిన్ షో చేస్తూ వీడియో, ఫోటోలు నెట్టింట పోస్ట్ చేయడం, వాటిని వేరే మహిళలతో ఇతరులు డీప్‌ఫేక్ చేయడం జరుగుతుంది. అసలు ఆ వీడియోలు లేకుంటే డీప్‌ఫేక్ అనేది కొంచెం తగ్గుతుంది కదా..?
ఇక్కడ కామెడీ ఏంటంటే.. డీప్‌ఫేక్ కి గురైన మహిళ పై ఒరిజినల్ వీడియోలో అందాలు ఆరబోసిన మహిళ సానుభూతి తెలియజేస్తూ మహిళల రక్షణ గురించి మాట్లాడడం. మహిళల రక్షణ పై తమకి భాద్యత ఉంటే.. వారూ కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉండడం అవసరం కదా..? అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇలాగే ఉండాలని ఎవరిని ఎవరు నిర్దేశించడం లేదు. ప్రభుత్వాలను, ఇతరులను తప్పుబట్టేటప్పుడు మనం కూడా కొంచెంలో కొంచెం బాధ్యతగా ఉండాలి కదా అని గుర్తు చేస్తున్నాము.
ప్రభుత్వం ఎన్ని చర్యలు, చట్టాలు తీసుకు వచ్చినా, డెవలప్ అవుతున్న టెక్నాలజీని తప్పుబట్టినా డీప్‌ఫేక్ ఆగడాలు ఆగిపోవడం అనేది జరగవు. ఒకరి పట్ల ఒకరు బాధ్యతగా ఉంటే తప్ప ఈ డీప్‌ఫేక్ ఆగడాలు అనేవాటిని కొంచెం కట్టడి చేయగలము. ఇక్కడ డీప్ ఫేక్ వీడియో చేసేవారిది ఎంత తప్పు ఉంటుందో.. సోషల్ మీడియాలో హద్దులుమీరి స్కిన్ షో చేస్తున్న వారిది కూడా అంతే తప్పు ఉంటుంది. అది గమనించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కొంచెం బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటున్నాము. డీప్‌ఫేక్ పై పోరాటానికి మీరుకూడా సహాయం పడతారని ఆశిస్తున్నాము.
Next Story