Fri Dec 20 2024 08:13:00 GMT+0000 (Coordinated Universal Time)
RCB Womens : ఆర్సీబీ మెన్స్ టీంపై వస్తున్న.. ఫన్నీ మీమ్స్ చూశారా..
ఆర్సీబీ ఫ్యాన్స్కి ఉమెన్స్ టీం కప్పు గెలిచినందుకు సంతోష పడాలా, మెన్స్ టీం పై వస్తున్న ట్రోల్స్ కి బాధ పడాలో అర్థంకావడం లేదు.
RCB Womens : 'ఈసాలా కప్ నమ్దే' అన్న పదాన్ని గత కొన్నేళ్లుగా ఆర్సీబీ మెన్స్ టీం చెప్పుకొస్తూనే ఉంది. ఈ ఏడాదికి ఆ ఏడాది.. ఈసాలా కప్ నమ్దే అంటూ చెప్పుకు రావడమే సరిపోతుంది గానీ, కప్పు ఎత్తడం అనేది జరగడం లేదు. ఇక ఆ పదాన్ని నిజం చేయడం అనేది ఒక కలగానే మిగిలిపోతుందేమో అని భయపడుతున్న ఆర్సీబీ ఫ్యాన్స్ కోసం.. ఉమెన్స్ టీం కప్పు తీసుకొచ్చి ఎక్కడాలేని సంతోషాన్ని తీసుకు వచ్చి ఇచ్చింది.
అయితే ఆ సంతోషాన్ని కాసేపు కూడా అనుభవించలేని పరిస్థితి అయ్యింది ఆర్సీబీ ఫ్యాన్స్ పరిస్థితి. ఇన్నాళ్లు మెన్స్ టీం చేయలేని పనిని, ఉమెన్స్ టీం కేవలం రెండేళ్లలోనే చేసి చూపించింది అంటూ.. మెన్స్ టీం పై ట్రోల్స్ వేస్తూ వస్తున్నారు. ఇక ఈ ట్రోల్స్ చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్కి.. ఉమెన్స్ టీం కప్పు గెలిచినందుకు సంతోష పడాలా, మెన్స్ టీం పై వస్తున్న ట్రోల్స్ కి బాధ పడాలో అర్థంకావడం లేదు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఫన్నీ మీమ్స్ అండ్ ట్రోల్స్ ని చూస్తూ నెటిజెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. వాటిని మీరుకూడా చూసి ఎంజాయ్ చేసేయండి.
Next Story