ప్రేమ పేరుతో వల.. అశ్లీల వీడియోలతో బెదిరింపులు
ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అపరిచితులను నమ్మి వారి కామకోరలలో చిక్కుకున్న విద్యార్థినుల ఉదంతాలు తమిళనాడులో సంచలనం సృష్టిస్తున్నాయి. నిందితుల వలలో చిక్కి ధీనంగా [more]
ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అపరిచితులను నమ్మి వారి కామకోరలలో చిక్కుకున్న విద్యార్థినుల ఉదంతాలు తమిళనాడులో సంచలనం సృష్టిస్తున్నాయి. నిందితుల వలలో చిక్కి ధీనంగా [more]
ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అపరిచితులను నమ్మి వారి కామకోరలలో చిక్కుకున్న విద్యార్థినుల ఉదంతాలు తమిళనాడులో సంచలనం సృష్టిస్తున్నాయి. నిందితుల వలలో చిక్కి ధీనంగా అభ్యర్థించే విద్యార్థినులకు సంబంధించిన రెండు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఒక కేసులో నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్లో సుమారు వందకుపైగా వీడియోలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అపరిచితులను నమ్మి మోసపోవడంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు.
ఆశ్లీల వీడియోలతో వేదిస్తూ
తమిళనాట ఓ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చికి చెందిన తిరునావుక్కరసు అదే ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థినితో ఫేస్బుక్లో పరిచయం పెంచుకున్నాడు. సాన్నిహిత్యం పెరిగినందున తన మిత్రులకు పరిచయం చేస్తానంటూ ఫిబ్రవరి 12న ఆమెను కారులో తీసుకెళ్లాడు. ఊంచపేలంపట్టి అనే ప్రాంతంలో తిరునావుక్కరసు మిత్రులు నలుగురు కారులోకి ఎక్కారు. నిర్జన ప్రాంతానికి కారును తీసుకెళ్లి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ నీచాన్ని మొబైల్లో చిత్రీకరించారు. లైంగికవాంఛ తీర్చాలని, లేకపోతే వీడియో, ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామంటూ బెదిరించారు. విద్యార్థిని తన తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం ప్రకారం ఫేస్‌బుక్‌తో అమ్మాయిలతో పరిచయం ఏర్పరచుకోవడం, ఆపై ప్రేమిస్తున్నానంటూ వారితో ఉల్లాసంగా గడపటం, వారి నగ్న దృశ్యాలను వీడియోలు తీసి బెదిరించి అత్యాచారం చేయడం, ఆపై అశ్లీల దృశ్యాలున్న వీడియోలను కుటుంబీకులకు చూపుతామంటూ డబ్బులు గుంజడాన్ని పనిగా పెట్టుకుని ఈ ముఠా సభ్యులు కోట్లు వసూలు చేశారు. ఈ కేసులో పొల్లాచ్చికి చెందిన శబరిరాజన్(25), తిరునావుక్కరసు(25), సతీశ్(28), వసంతకుమార్(27)లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.
అధికార పార్టీ నేత హస్తం..?
నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లలో ఎంతోమంది అమ్మాయిల అశ్లీల చిత్రాలు, వీడియోలు గుర్తించారు. వాటి ఆధారంగా 200 మందికి పైగానే బాధితులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ముఠా సభ్యులు తమ అక్కాచెల్లెల్లు చదువుతున్న పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న అమ్మాయిల సెల్‌ఫోన్ నంబర్లు తీసుకుని వారితో పరిచయాలు ఏర్పరచుకునేవారు. ధనవంతుల బిడ్డల్లా పోజిస్తూ, ప్రేమ పేరిట అమ్మాయిలకు దగ్గరై, వారికి మత్తు మందిచ్చి అత్యాచారానికి పాల్పడేవారు. తననూ అలాగే మోసగించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోకుంటే సోదరుడిని చంపేస్తామంటూ బాధితురాలిని కొందరు బెదిరించారు. ఈ వ్యవహారంలో సెంథిల్ (33), బాబు (26), నాగరాజ్‌ను (27) పోలీసులు అరెస్టు చేశారు. నాగరాజ్ అన్నాడీఎంకే పొల్లాచ్చి శాఖ యువ నాయకుడు. ధనబలం, అంగబలంతో పాటు అధికార పార్టీ అండ ఉండటంతో ఈ ముఠా చెలరేగిపోయింది. ఈ వ్యవహారంలో కొందరు ప్రముఖులకూ సంబంధం ఉందంటూ అరెస్టుకు ముందు సామాజిక మాధ్యమాల్లో తిరునావుక్కరసు ఆడియో విడుదల చేయడం కలకలం రేపింది. విద్యార్థినులపై లైంగిక దాడుల ఘటనల వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయముందనే వదంతులు రావడంతో ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. నిందితుల నుంచి నాలుగు వీడియోలను స్వాధీనం చేసుకున్నామని కోయంబత్తూరు ఎస్పీ తెలిపారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు భయపడకుండా పోలీసులను ఆశ్రయంచాలని లెదంతే నిందితుల అరాచకానికి అమాయకులు బలి అవ్వాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.