పరువుపోతుందనే హత్య చేశాడు
హైదరాబాదులో సంచలనం సృష్టించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సతీష్ హత్యకేసులో నిందితుడైన హేమంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో సతీష్ ను హేమంత్ దారుణంగా [more]
హైదరాబాదులో సంచలనం సృష్టించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సతీష్ హత్యకేసులో నిందితుడైన హేమంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో సతీష్ ను హేమంత్ దారుణంగా [more]
హైదరాబాదులో సంచలనం సృష్టించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సతీష్ హత్యకేసులో నిందితుడైన హేమంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో సతీష్ ను హేమంత్ దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. గత నెల 27న రాత్రి హేమంత్ రూమ్ కు సతీష్ వెళ్లాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఈ క్రమంలోనే ఆఫీసులో పనిచేస్తున్న యువతితో హేమంత్ కు వివాహేతర సంబంధం ఉందనే విషయంలో వారిమధ్య తగాదా వచ్చింది. ఇలా చేయకూడదని సతీష్ హేమంత్ ను మందలించాడు. దీంతో భయాందోళనకు గురైన హేమంత్ ఈ విషయం ఎవరికైనా తెలిస్తే తనపరువు పోతుందని భావించాడు. సతీష్ ను అడ్డుతొలగిస్తే వారి వ్యవహారం బయటపడదని భావించాడు. దీంతో సతీష్ ను కత్తితో పొడిచి చంపేశాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న హేమంత్ ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని విచారించారు. కేవలం తనొక్కడినే సతీష్ ను హత్యచేసినట్లు అంగీకరించాడు. ఇందులో ఇతరుల ప్రమేయం ఏమి లేదని చెప్పాడు.