Wed Nov 20 2024 18:25:42 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీలోకి దూకేందుకు రెడీ... బాబు ఓకే చెబుతారా?
చంద్రబాబు చివరి నిమిషంలో వస్తే కుదరదని చెప్పడంతో టీడీపీ వైపు దూకేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ తమ రాజకీయ భవిష్యత్ కోసం నేతలు చివరి నిమిషం వరకూ ప్రయత్నిస్తూనే ఉంటారు. తాము ఉన్న పార్టీలో తమకు గౌరవం, టిక్కెట్ వస్తుందన్న నమ్మకం లేకపోతే ఇక పార్టీని వీడటం ఖాయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరుగుతుంది. వైసీపీలో ఉన్న అసంతృప్తి నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు. మరో వైపు చంద్రబాబు చివరి నిమిషంలో వస్తే కుదరదని చెప్పడంతో టీడీపీ వైపు దూకేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది.
వైసీపీలో ప్రాధాన్యత లేక...
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో మాజీ మంత్రి శమంతకమణి, ఆమె కూతురు మాజీ ఎమ్మెల్యే యామిని బాలలు టీడీపీ వైపునకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. వారికి వైసీపీలో తగిన పదవులు లభించక పోవడం, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పట్టించుకోక పోవడంతో మనస్తాపంతో ఉన్నారు. వైసీపీలో తాము కొనసాగితే రాజకీయంగా భవిష్యత్ ఉండదని వారు భావిస్తున్నారు.
టీడీపీలో ఉన్నప్పడు....
శమంతకమణి కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చారు. టీడీపీలో చంద్రబాబు సముచిత గౌరవాన్ని ఇచ్చారు. శమంతకమణికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆమె కూతురు యామినీ బాలకు 2014లో ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడంతో ఆమె గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో వీరికి టిక్కెట్ ఇవ్వకుండా జేసీ అనుచరులైన బండారు శ్రావణికి చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. దీంతో వీరు వైసీపీలోకి జంప్ చేశారు. వైసీపీలో చేరిన తర్వాత అనేక పదవుల కోసం ఎదురు చూశారు.
హామీ ఇస్తే....
కానీ ఎమ్మెల్సీ పదవిని ఆశించిన శమంతకమణికి నిరాశ ఎదురయింది. భవిష్యత్ లో కూడా వస్తుందన్న ఆశలేదు. ఇక వచ్చే ఎన్నికల్లోనూ తమ కుటుంబానికి టిక్కెట్ లభిస్తుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇక్కడ జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త సాంబశివారెడ్డి స్ట్రాంగ్ అయ్యారు. టీడీపీ పరిస్థిితి టీడీపీ నుంచి హామీ లభిస్తే దూకేందుకు సిద్దంగా ఈ తల్లీ కూతుళ్లున్నారు. మరి చంద్రబాబు వీరి రాకకు ఓకే చెబుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
- Tags
- chandra babu
- tdp
Next Story