Thu Jan 16 2025 11:07:26 GMT+0000 (Coordinated Universal Time)
సోనియా వచ్చేస్తున్నారు....!!
తెలంగాణ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా తీసుకుంది. ఇందులో భాగంగానే సోనియా గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ ఒక దఫా ప్రచారం నిర్వహించగా సోనియా గాంధీ కూడా ప్రచారపర్వంలోకి దిగనున్నారు. ఆమె ఈ నెల 19 తర్వాత రెండు రోజుల పాటు తెలంగాణలోనే ఉండనున్నారు.
నాలుగు సభల్లో.....
ఉత్తర తెలంగాణలో రెండు సభలు, దక్షిణ తెలంగాణలో రెండు సభల్లో ఆమె పాల్గొని ప్రచారం చేయనున్నారు. తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా సోనియా గాంధీ తెలంగాణ ప్రజల్లో మంచి ఇమేజ్ ఉంది. దీంతో సోనియా ప్రచారంతో కాంగ్రెస్ పార్టీకి మరింత సానుకూలత ఏర్పడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
Next Story