కేసు విచారించడానికి వెళ్లి?
పోలీసుల్లో కీచకులు నానాటికి ఎక్కువ అయిపోతున్నారు. ఇటీవల కాలంలో వరుస సంఘటనలు పోలీసు శాఖలో ఆందోళన కల్గిస్తున్నాయి. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. రాచకొండ పోలీస్ [more]
పోలీసుల్లో కీచకులు నానాటికి ఎక్కువ అయిపోతున్నారు. ఇటీవల కాలంలో వరుస సంఘటనలు పోలీసు శాఖలో ఆందోళన కల్గిస్తున్నాయి. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. రాచకొండ పోలీస్ [more]
పోలీసుల్లో కీచకులు నానాటికి ఎక్కువ అయిపోతున్నారు. ఇటీవల కాలంలో వరుస సంఘటనలు పోలీసు శాఖలో ఆందోళన కల్గిస్తున్నాయి. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ నరేందర్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మీర్ పేట్ పరిధిలో ఒక ఇంటికి ఎస్ఐ నరేందర్ వెళ్లడం జరిగింది. ఒక కేసుకు సంబంధించి మహిళలను విచారించేందుకు ఎస్ ఐ నరేందర్ వెళ్ళాడు. ఒంటరిగా ఉన్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి.
షీ టీం కు ఫిర్యాదు….
అయితే ఈ మహిళ షీ టీమ్ కు ఫిర్యాదు చేయడంతో దీనిపై సమగ్ర విచారణ మొదలైంది. ఎస్ఐ నరేందర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు గురి చేశాడని షీ టీమ్స్ ముందు మహిళ చెప్పింది. దీనిపై సమగ్ర విచారణ చేశారు. అయితే విచారణలో నరేందర్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లుగా తేలింది. దీంతో ఎస్ ఐ నరేందర్ ను సస్పెండ్ చేస్తూ రాచకొండ పోలీస్ కమిషన్ ఆదేశాలు జారీ చేశారు.