స్పైస్ జెట్ ప్రయాణికుడికి చేదు అనుభవం
ముంబయి నుంచి బెంగళూరు వెళుతున్న ప్రయాణికుడికి స్పైస్ జెట్ ఫ్లయిట్లో చేదు అనుభవం ఎదురైంది. ప్రయాణం ప్రారంభమైన కొద్ది సేపటికే ఆయన టాయిలెట్‌కి వెళ్లారు.బయటకు రావడానికి ప్రయత్నిస్తే, డోర్ బిగుసుకుపోయింది. ఎంత ప్రయత్నించినా రాలేదు. దీంతో అతను దాదాపు రెండు గంటలు టాయిలెట్లోనే ఉండిపోయారు.
ముంబయి నుంచి బెంగళూరు వెళుతున్న ప్రయాణికుడికి స్పైస్ జెట్ ఫ్లయిట్లో చేదు అనుభవం ఎదురైంది. ప్రయాణం ప్రారంభమైన కొద్ది సేపటికే ఆయన టాయిలెట్‌కి వెళ్లారు. బయటకు రావడానికి ప్రయత్నిస్తే, డోర్ బిగుసుకుపోయింది. ఎంత ప్రయత్నించినా రాలేదు. దీంతో అతను దాదాపు రెండు గంటలు టాయిలెట్లోనే ఉండిపోయారు.
ఫ్లయిట్ ల్యాండింగ్ సమయానికి సీట్లో ప్యాసింజర్ లేకపోవడంతో ఎయిర్ హోస్టెస్‌కు సందేహం వచ్చింది. టాయిలెట్ తలుపు కూడా వేసి ఉండటంతో విషయం అర్థమైంది. స్టాఫ్ అంతా కలిసి తలుపు తెరవడానికి ప్రయత్నించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ‘సర్ మేం డోర్ తీయడానికి ప్రయత్నించాం. కానీ కుదరలేదు. కొద్ది నిముషాల్లో విమానం ల్యాండ్ అవుతుంది. ఇంజినీర్లు వచ్చి తలుపు తెరుస్తారు. మీరు భయపడొద్దు. కమోడ్ మూత వేసి, మీద కూర్చోండి.’ అంటూ ఓ చిన్న కాగితం మీద రాసి తలుపు కింద నుంచి లోపలికి పంపించారు.
చివరకు ఫ్లయిట్ బెంగళూరులో ల్యాండ్ అయిన తర్వాత ఇంజినీరింగ్ సిబ్బంది వచ్చి తలుపు విరగ్గొట్టి ఆ ప్రయాణికుడిని బయటకు తీసుకు వచ్చారు. ఈ సంఘనటపై స్పైస్ జెట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సదరు బాధితుడికి టిక్కెట్ డబ్బులు వాపసు చేస్తామని ప్రకటించింది. ‘ఇకపై వాష్‌రూమ్‌లో కూడా సీట్ బెల్ట్‌లు ఏర్పాటు చేస్తే సరి’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.