లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదా?
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. కొత్తగా 983 మందికి కరోనా సోకింది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,419కి చేరింది. ఇప్పటి [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. కొత్తగా 983 మందికి కరోనా సోకింది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,419కి చేరింది. ఇప్పటి [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. కొత్తగా 983 మందికి కరోనా సోకింది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,419కి చేరింది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 247 మంది మృతి చెందారు. కొత్తగా నమోదయిన కేసులు 983లో హైదరాబాద్ లోనే 816 ఉన్నాయి. హైదరాబాద్ లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరోసారి లాక్ డౌన్ విధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైద్య ఆరోగ్యశాఖ నివేదిక ఇచ్చింది. దీనిపై కేబినెట్ లో చర్చించి రెండు, మూడు రోజుల్లో లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునే అవకాశముంది. అయితే లాక్ డౌన్ విధిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా కేసీఆర్ చర్చిస్తున్నారు. పదిహేను రోజుల పాటు లాక్ డౌన్ ను విధించాలని సూచనలను పరిగణనలోకి తీసుకోనున్నారు. లాక్ డౌన్ విధిస్తేనే హైదరాబాద్ లో కరోనా కంట్రోల్ అవుతుందని అంటున్నారు.