ఎన్ని ట్విస్టులు… ఇంతకీ ఎవరు కారణం?
నటి శ్రావణి ఆత్మహత్య కేసు టీవీ సీరియల్ లా రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ రెడ్డి ఎస్ఆర్ నగర్ పోలీసుల [more]
నటి శ్రావణి ఆత్మహత్య కేసు టీవీ సీరియల్ లా రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ రెడ్డి ఎస్ఆర్ నగర్ పోలీసుల [more]
నటి శ్రావణి ఆత్మహత్య కేసు టీవీ సీరియల్ లా రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ రెడ్డి ఎస్ఆర్ నగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇప్పటి వరకు దేవరాజ్, సాయి కృష్ణ రెడ్డి పై తిరిగిన ఈ కేసు ఆర్ ఎక్స్ 100 సినీ నిర్మాత అశోక్ రెడ్డి ఆడియో టేప్ బయట పడటంతో కేసు మరో మలుపు తిరిగింది. ఎపిసోడ్ ల మీద ఎపిసోడ్లు సాగుతున్న ఈ కేసులో పోలీసులు ఎలా ఫుల్ స్టాప్ పెడతారో వేచి చూడాల్సింది.
పరస్పర ఆరోపణలు…
నటి శ్రావణి ఆత్మహత్యకు దేవరాజ్ కారణమని సాయి.. కాదు సాయే కారణమని దేవరాజ్ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వారి వద్ద ఉన్న ఫోన్ సంభాషణ టేప్ లను బయట పెట్టారు. దీనితో ఈ కేసు చిత్ర విచిత్రాలు తిరిగి పోలీసులను తికమక పెట్టింది. దేవరాజ్ బ్లాక్ మెయిల్ వల్లే శ్రావణి చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు గట్టిగా నమ్ముతున్నారు.
ఆడియో సంభాషణలను…..
శ్రావణి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దేవరాజ్ తన అడ్వకేట్ తో కలిసి ఎస్ఆర్ నగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. శ్రావణి చనిపోయే ముందు లాస్ట్ కాల్ తనతో మాట్లాడింది. తాను సూసైడ్ చేసుకుంటా అని చెప్తే నేను వద్దు అంటూ వారించానని దేవరాజ్ పోలీసులతో తెలిపాడు. తన చావుకు సాయి కారణమని చెప్పిందని ఆడియో టేప్ లను పోలీసులకు అందించాడు.అయితే సాయి, శ్రావణి కుటుంబ సభ్యులు మాత్రం దేవరాజ్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాత ఆడియో టేప్ లతో కేసు దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉంటె దేవరాజ్ మరో బాంబు పేల్చాడు.. సాయి తో పాటు ఆర్ ఎక్స్ 100 సినీ నిర్మాత అశోక్ రెడ్డి పాత్ర బయట పెట్టాడు. శ్రావణిని లొంగ దీసుకోవడానికి అశోక్ అనేక ప్రయత్నాలు చేశాడని, ఆమెపై వత్తిడి చేశాడంటూ మరో ఫోన్ సంభాషణ ఆడియో టేప్ పోలీసులకు అందించాడు.
మూడు మలుపులు….
అశోక్ రెడ్డి, శ్రావణిల మధ్య ఉన్న పరిచయం తెలిసి తాను దూరంగా ఉంటున్నానాని చెప్పాడు. సాయి , అశోక్ రెడ్డి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా ఈ కేసు మూడు మలుపులు తిరిగింది. దేవరాజ్ తరువాత సాయి, అశోక్ రెడ్డి లను విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో మూడు ప్రత్యేక పోలీస్ టీమ్స్ పని చేస్తున్నాయి. ముగ్గురి విచారణ తరువాతే ఈ కేసులో శ్రావణి ఆత్మహత్యకు ఎవరు కారణం అనేది తెలిసేలా ఉంది. మరో పక్కన ఈ మూడు ఆడియో టేప్ లను ఎఫఎస్ఎల్ కి పంపాలని పోలీసులు భావిస్తున్నారు.