Mon Dec 23 2024 12:32:26 GMT+0000 (Coordinated Universal Time)
దేశం విడిచి పరారీ
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయి రాజపక్స దేశం నుంచి పరరాయ్యారు
లంక అధ్యక్షుడు గొటబాయి రాజపక్స దేశం నుంచి పరరాయ్యారు. గత కొంత కాలంగా శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. నిత్యావసరాల వస్తువులు విపరీతంగా పెరిగాయి. పెట్రోలు కూడా దొరకడం లేదు. దీంతో ప్రజలు ఆందోళనకు దిగారు. ఆయన రాజీనామా చేయాలంటూ ప్రజలు నిరసనలకు దిగారు.
ఆందోళనకారులు...
దీంతో ఆయన దేశం విడిచి వెళ్లారు. ఈ మేరకు శ్రీలంక రక్షణ శాఖ ప్రకటించింది. ఆందోళనకారులు తనపైనా, తన ఇంటిపైన దాడులు చేస్తారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఆయన దేశం విడిచిపోయారు. గతంలో ఆయన సోదరుడు ప్రధాని మహేంద్ర రాజపక్స ఇంటిని ముట్టడించడంతో ఆయన దేశం విడిచి పారిపోయారు. తాజాగా దేశ అధ్యక్షుడు కూడా దేశం విడిచి పారిపోవడం చర్చనీయాంశంగా మారింది.
Next Story