జగన్ కేంద్రంతో కుమ్మక్కయ్యారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ మండిపడ్డారు. ప్రాజెక్టులు కేంద్రం అధీనంలోకి తీసుకోవాలని జగన్ లేఖ రాయడంపై ఆయన అభ్యంతరం [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ మండిపడ్డారు. ప్రాజెక్టులు కేంద్రం అధీనంలోకి తీసుకోవాలని జగన్ లేఖ రాయడంపై ఆయన అభ్యంతరం [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ మండిపడ్డారు. ప్రాజెక్టులు కేంద్రం అధీనంలోకి తీసుకోవాలని జగన్ లేఖ రాయడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేయకముందే కేంద్రం అధీనంలోకి తీసుకోవాలని జగన్ ఎలా కోరతారని శ్రీనివాసగౌడ్ ప్రశ్నించారు. కేంద్రంతో జగన్ లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లుందని శ్రీనివాస గౌడ్ అన్నారు. అప్పటి ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ఇచ్చిన జీవోలు ఉత్తుత్తివా? అని ఆయన అన్నారు. తాము నిబంధనలు అతిక్రమించలేదని, ఆంధ్రనేతలది వితండ వాదమని శ్రీనివాసగౌడ్ అభిప్రాయపడ్డారు.