కల్పన హత్య కూడా వాడి పనే..!
సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ఆకృత్యాలు ఒక్కోటి బయటకొస్తున్నాయి. మొన్న శ్రావణి అనే ఇంటర్ బాలిక హత్య కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న శ్రీనివాస్ రెడ్డి విచారణలో [more]
సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ఆకృత్యాలు ఒక్కోటి బయటకొస్తున్నాయి. మొన్న శ్రావణి అనే ఇంటర్ బాలిక హత్య కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న శ్రీనివాస్ రెడ్డి విచారణలో [more]
సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి ఆకృత్యాలు ఒక్కోటి బయటకొస్తున్నాయి. మొన్న శ్రావణి అనే ఇంటర్ బాలిక హత్య కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న శ్రీనివాస్ రెడ్డి విచారణలో సంచలన విషయాలను కక్కుతున్నాడు. శావణిని పాతిపెట్టిన బావిలో రెండు నెలల క్రితం హజీపూర్ గ్రామానికే చెందిన మనీషా ఆనే మరో ఇంటర్ బాలికను కూడా అత్యాచారం చేసి చంపి పాతిపెట్టినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు నిన్న మనీషా మృతదేహాన్ని వెలికితీశారు. అయితే, ఇక్కడి సమీప గ్రామానికి చెందిన కల్పన అనే 11 ఏళ్ల బాలిక నాలుగేళ్ల క్రితం హజీపూర్ గ్రామానికి వచ్చి అదృశ్యమైంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా జాడ తెలియలేదు. ఇప్పుడు శ్రీనివాస్ ఆకృత్యాలు బయటకు రావడంతో కల్పనను కూడా అతడే హత్య చేసినట్లు అనుమానాలు వస్తున్నాయి.
చెట్టుకు కట్టేసి కొట్టినా మారని బుద్ధి
పోలీసుల విచారణలో అతడి ఈ హత్య కూడా చేసినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో గ్రామంలోని బావిలో మళ్లీ పోలీసులు సోదాలు జరుపుతున్నారు. గ్రామంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయినా కూడా ఆగ్రహంతో గ్రామస్థులంతా ఇటీవలే శ్రీనివాస్ కుటుంబసభ్యులు కట్టుకున్న ఇంటిని తగులబెట్టారు. శ్రీనివాస్ పై ఇంతకుముందు కర్నూలు, వరంగల్ జిల్లాల్లోనూ అత్యాచార కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఇటీవల గ్రామానికి చెందిన ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిని గ్రామస్థులంతా చెట్టుకు కట్టేసి కొట్టారు. ఒంటరిగా కళాశాలకు వెళుతున్న అమ్మాయిలను లిఫ్ట్ ఇస్తానని చెప్పి అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.