మెట్రో ఛార్జీల పెంపునకు రెడ్ సిగ్నల్
హైదరాబాద్ మెట్రో రైలు చార్జీలు పెంచాలన్న ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.
హైదరాబాద్ మెట్రో రైలు చార్జీలు పెంచాలన్న ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. అందిన సమాచారం మేరకు పలు మార్లు మెట్రో చార్జీలను పెంచాలని ఎల్ అండ్ టి నుంచి ఒత్తిడులు వచ్చినప్పటికీ, ఆ సంస్థతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రస్తుతం ఉన్న మెట్రో బోగీలను పెంచకుండా, ప్రయాణికులకు మరిన్ని మౌలిక సదుపాయాలను కల్పించేంతవరకు చార్జీల పెంపుకు ఎట్టిపరిస్థితిలోనూ అంగీకరించేది లేదని ప్రభుత్వం ఖరాఖండీగా చెప్పినట్లు తెలిసింది. హైదరాబాద్ మెట్రో రైలు లో ప్రయాణ చార్జీల పెంపుపై ప్రతిపాదనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2022 సెప్టెంబర్ 5 వ తేదీన ఫెయిర్ ఫిక్ షెషన్ కమిటీ (FFC ) ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ గుడి సేవా శ్యామ్ ప్రసాద్ ను చైర్మన్ గా, కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ డాక్డర్ సురేంద్ర కుమార్ బాగ్డే, రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ స్పెషల్ సి.ఎస్. అరివింద్ద్ కుమార్ లను సభ్యులుగా నియమించింది.