బ్రేకింగ్ : ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రభుత్వం పై రాష్ట్ర హైకోర్టు మరొకసారి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.. కరోనా కేసులు తాము ఇచ్చిన ఆదేశాల్లో ఒక్కటి కూడా ప్రభుత్వం అమలు చేయడం [more]
తెలంగాణ ప్రభుత్వం పై రాష్ట్ర హైకోర్టు మరొకసారి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.. కరోనా కేసులు తాము ఇచ్చిన ఆదేశాల్లో ఒక్కటి కూడా ప్రభుత్వం అమలు చేయడం [more]
తెలంగాణ ప్రభుత్వం పై రాష్ట్ర హైకోర్టు మరొకసారి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.. కరోనా కేసులు తాము ఇచ్చిన ఆదేశాల్లో ఒక్కటి కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది.. అంతేకాకుండా జూన్ ఎనిమిదో తేదీ నుంచి కరోనా కేసులపై తాము ఇచ్చిన ఆదేశాలు ఒక్కటి కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇలా వ్యవహరించడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం విడుదల చేస్తున్న కరోనా బులిటెన్ లో కూడా తప్పుల తడకలు ఉన్నాయని, నిన్న విడుదల చేసిన బులిటెన్ లో కూడా చాలా లోపాలు ఉన్నాయని హైకోర్టు తెలిపింది. . తమ ఆదేశాలను ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అడిగి తెలుసుకుంటామని పేర్కొంది. కరోనా పై దాఖలైన వివిధ పిటిషన్లను రేపు విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొంది