చింతమనేని… నీకు నోరెలా వచ్చింది..?
దళితులను కించపరుస్తూ అసభ్య పదజాలంతో దూషించిన తెలుగుదశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇటీవల జన్మభూమి కార్యక్రమంలో [more]
దళితులను కించపరుస్తూ అసభ్య పదజాలంతో దూషించిన తెలుగుదశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇటీవల జన్మభూమి కార్యక్రమంలో [more]
దళితులను కించపరుస్తూ అసభ్య పదజాలంతో దూషించిన తెలుగుదశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇటీవల జన్మభూమి కార్యక్రమంలో భాగంగా చింతమనేని మాట్లాడుతూ… దళితులను కించపరుస్తూ రాయలేని విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో నిన్నటి నుంచి వైరల్ అయ్యింది. దీంతో చింతమనేనిపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చింమనేనిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ సంఘం సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏలూరులో చింతమనేని వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.