బ్రేకింగ్: ఐటీ గ్రిడ్ వద్ద తెలంగాణ డేటా కూడా..!
ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ కేసును పూర్తి శాస్త్రీయ కోణంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ చేస్తామని సిట్ అధికారి ఐజీ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. ఈ కేసు [more]
ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ కేసును పూర్తి శాస్త్రీయ కోణంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ చేస్తామని సిట్ అధికారి ఐజీ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. ఈ కేసు [more]
ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ కేసును పూర్తి శాస్త్రీయ కోణంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ చేస్తామని సిట్ అధికారి ఐజీ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. ఈ కేసు గురించి ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… సైబర్ క్రైమ్ కు సంబంధించిన కేసు కాబట్టి కేసు విచారణకు నిపుణులు అవసరమైన ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. డేటా చోరీకి సంబధించి ఇప్పటి వరకు జరిగిన పూర్తి విచారణను తెలుసుకున్నామని తెలిపారు. వీలైనంత త్వరలో కేసు విచారణ పూర్తి చేసి నిజానిజాలు తేలుస్తుమన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని కేసులో అన్ని విషయాలు బయటకు తెస్తామన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఎవరైనా దోషిలని తేలితే ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కేసు విషయమై మీడియా కొంచెం సంయమనం పాటించాలని ఆయన కోరారు. సీజ్ చేసిన కంప్యూటర్లలో కొంత డేటాను కనుగొన్నామని, ఈ డేటా ఎలా వచ్చిందో విచారిస్తున్నామని అన్నారు.
అమరావతిలో ఉన్నా అమెరికాలో ఉన్నా పట్టుకొస్తాం
ఐటీ గ్రిడ్ వద్ద తెలంగాణకు చెందిన డేటా కూడా ఉందని, ఈ డేటా వీరి వద్ద ఎందుకు ఉందో తేలుస్తామన్నారు. సేవామిత్ర యాప్ లో ఓటరుకు చెందిన చాలావరకు వ్యక్తిగత వివరాలు ఉన్నాయని, వాటిని దుర్వినియోగం చేసినట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ వివరాల ఆధారంగా ఓట్లు తొలగిస్తున్నారనే ఫిర్యాదు వచ్చిందని, ఈ విషయంపై కూడా విచారణ చేస్తామన్నారు. ఇంకా ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే తమకు చేయవచ్చని తెలిపారు. పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్ సంస్థ సీఈఓ అశోక్ దాకవరపును విచారిస్తేనే అన్ని విషయాలూ తేలుతాయన్నారు. ఆయనకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామన్నారు. అశోక్ అమరావతిలో ఉన్నా అమెరికాలో ఉన్నా తీసుకువచ్చి విచారిస్తామని స్పష్టం చేశారు. ఈ సంస్థపై ఫిర్యాదు రాగానే సేవామిత్రా యాప్ ను మార్చారని, అప్పటివరకు కలర్ ఫోటోతో ఉన్న ఓటరు జాబితా తర్వాత మార్చారని అన్నారు. ఫిబ్రవరి 22న తమకు ఫిర్యాదు వచ్చాక సంస్థ కార్యాలయానికి వెళ్లి ఆరా తీశామని, తర్వాత ఈ యాప్ లో మార్పులు చేశారని పేర్కొన్నారు.