Tue Dec 24 2024 00:33:12 GMT+0000 (Coordinated Universal Time)
ఇస్తాంబుల్లో ఆత్మాహుతి దాడి.. ఏడుగురు దుర్మరణం.. 80మందికి పైగా గాయాలు
ఇస్తాంబుల్ లో ఈ మార్కెట్ ప్రాంతం పర్యాటకులు, స్థానికులతో ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఆత్మాహుతి బాంబు పేలుడుకు..
టర్కీ రాజధాని ఇస్తాంబుల్.. బాంబుల మోతతో దద్దరిల్లింది. నిత్యం జనసంచారంతో రద్దీగా ఉండే బియోగ్లు జిల్లాలోని ఇస్తిక్లాల్ ఎవెన్యూలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఒక్కసారిగా పేలుళ్ల మోత వినిపించడంతో.. ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. స్థానిక కాలమానం ప్రకారం.. నిన్న సాయంత్రం 4గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మాహుతి దాడిలో ఏడుగురు దుర్మరణం చెందగా.. 80 మందికి పైగా గాయపడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ మేరకు ఇస్తాంబుల్ గవర్నర్ అలీయెర్లికాయ అధికారిక ట్వీట్ చేశారు.
ఇస్తాంబుల్ లో ఈ మార్కెట్ ప్రాంతం పర్యాటకులు, స్థానికులతో ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఆత్మాహుతి బాంబు పేలుడుకు మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనను టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తీవ్రంగా ఖండించారు. దీనిని ఉగ్రదాడిగా అనుమానిస్తున్నామని, ఇదొక నీచమైన దాడి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దాడి వెనుక నేరస్తులను కనుగొనడానికి సంబంధిత విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. కాగా.. ఈ ఆత్మాహుతి దాడికి ఓ మహిళ కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని స్థానిక మీడియా పేర్కొంది.
Next Story