జగన్ కేసులతో నాకు పోలిక లేదు....!!
మాజీ కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదిరి మీడియా సమావేశం పెట్టారు. తన కంపెనీల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నిర్వహించిన సోదాలు, తనకు ఇచ్చిన నోటీసులపై ఆయన స్పందించారు. వైఎస్ జగన్ కేసులకు తనపై సోదాలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆయన ప్రెస్ మీట్ లోనిముఖ్యాంశాలు.
* అనామక కంపెనీతో నా కంపెనీకి సంబంధాలు ఉన్నాయని సోదాలు జరిపారు.
* బెస్ట్ అండ్ క్రమ్టన్ లో లావాదేవీలు జరిపారని పేర్కొన్నారు.
* నేను 30 సంవత్సరాల క్రితం స్థాపించిన కంపెనీలు బ్యాంకింగ్ చేస్తున్నారు.
* బెస్ట్ అండ్ క్రాంప్టన్ అనే సంస్థ మా స్నేహితులది. వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను. వాళ్ళు వస్తుంటారు.
* దేశ వ్యాప్తంగా నా దగ్గరికి అనేక కంపెనీలు నా సలహాల కోసం వస్తుంటారు.
* గత 27 సంవత్సరాల నుంచి నేను ఒకే ఇంట్లో ఉంటున్నాను.
* ఈడి జప్తు చేసిన 6కార్లలో 3కార్లు మా అబ్బాయి పేరుమీద ఉన్నాయి.
* 3లక్షల రూపాయల కారును పాతది ఢిల్లీకి చెందిన కారు.
* నాగార్జున హిల్స్ లో ఉన్న సంస్థకి నలుగురు ఓనర్స్ ఉన్నారు.
* 2010 తరువాత నా కార్యాలయాలకి ఎప్పుడు వెళ్ళలేదు.
* నా రాజకీయ జీవితం ప్రారంభం కాగానే వ్యాపారాల పై దృష్టి పెట్టలేదు.
* నా పేరుమీద ఉన్న కంపెనీలు ఎలాంటి తప్పులు, ఫ్రాడ్స్ చెయ్యలేదు.
* 2015వరకు అన్ని రకాల ఆర్థిక వ్యవహారాలు క్లియర్ గా ఉన్నాయి.
* బ్యాంక్ నుంచి అప్పులు తీసుకోవడం అనేది క్రిమినల్ చర్య కాదు. ఈడీ చెప్పినంత లావాదేవీలు బ్యాంక్ లలో ఉండవు.
* నా కంపెనీలకు నేను నా స్నేహితుడు శ్రీనివాస్ రాజు ఉన్నాం.
* 120 కంపెనీలు ఉన్నాయి అని ఈడి ప్రకటన చేసింది...అన్ని కంపెనీలు పెట్టకూడదు అని రూల్ ఉందా.?
* 2012 తరువాత నేను కంపెనీల నుంచి ఎలాంటి జీతాలు తీసుకోలేదు.
* నా సంస్థల పై బ్యాంక్ పిర్యాదు మేరకు సోదాలు అని అన్నారు...కానీ ఎలాంటి బ్యాంక్ లు ఫిర్యాదు చెయ్యలేదు.
* కొన్ని మీడియా సంస్థలు ఇష్టాను సారంగా వేస్తున్నాయి.
* సాయంత్రం 7గంటలకు సమన్లు ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం ఈడి కి హాజరౌతాను.
* నా పేరుమీద ఎలాంటి కంపెనీలు లేవు.
* సి రామచంద్రయ్య నా పై చేసిన ఆరోపణలు ఆయన విజ్ఞతకే వదిలేస్తా.
* ఈడీ చూపించిన బ్యాలెన్సుషీట్ లో ఉన్న అమౌంట్ అనేది వాస్తవం కాదు.
* ఈడీ చేసిన సోదాల పై లీగల్ గా వెళ్తా...చర్చలు జరుపుతున్నాము.
* 2009 ఎన్నికల తరువాత నా పై ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి.
* నిజంగా ఏదైనా అక్రమాలు జరుగితే చట్టపరంగా ఎదుర్కొంటాము.
* పీఎంఎల్ఐ యాక్ట్ ప్రకారం మాత్రమే సమన్లు ఇచ్చాను.
* నా ఆస్తుల విలువ అప్పుల కంటే ఎక్కువనే ఉన్నాయి.
* నా కంపెనీలలో శ్రీనివాస్ ఎలాంటి పెట్టుబడులు అంతగా పెట్టలేదు.
* ఈడీ చేసిన సోదాలు తొందరపాటు చర్యగా కనిపిస్తోంది.
* వైఎస్ జగన్ కేసులకు..నా పై సోదాలకు సంబంధం లేదు.