Wed Apr 02 2025 12:55:30 GMT+0000 (Coordinated Universal Time)
Summer Effect : సమ్మర్ ఈ మూడు నెలలు ఎంతమందిని ముంచుతుందో?
వేసవి కాలం ముందే వచ్చేసింది. ఎండల తీవ్రత కూడా ఎక్కువయింది

సవి కాలం ముందే వచ్చేసింది. ఎండల తీవ్రత కూడా ఎక్కువయింది. గత మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే విజయవాడలో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే ఇక మార్చి మొదటి వారంలోనే నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు చేరుకుంటే రానురాను ఇంకెంత స్థాయిలో పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అప్పుడే గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీర ప్రాంతం కావడంతో ఉక్కపోత కూడా మొదలయింది. సాయంత్రానికి కాని చల్లగాలులు రావడం లేదు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రంఐదు గంటలవరకూ వడగాలులు వీస్తున్నాయి.
తెలంగాణలోనూ...
తెలంగాణలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత సీజన్ తో పోలిస్తే ఈ ఏడాది మార్చినెలలో మూడు నుంచి నాలుగు రెట్లు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా ఏప్రిల్ రాలేదు. మే నెల రావడానికిరెండు నెలల సమయం ఉంది. కానీ ఇప్పటికే ఇంత వేడి తీవ్రత ఎక్కువగా ఉండటం ప్రజలు భయపడిపోతున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే వాహనాలు ప్రమాదానికి గురవుతాయని కూడా అధికారులు హెచ్చరింస్తన్నారు.
రానున్న కాలంలో...
ఇక రోజు వారీ కూలీల పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. చిరు వ్యాపారులు కూడా తమ వ్యాపారాలను ఉదయం వేళ తెరించేందుకు భయపడిపోతున్నారు. మార్కెట్ కు వచ్చే వారిసంఖ్య కూడా సాయంత్రం వేళ ఎక్కువగా ఉండటంతో రాత్రి వేళ వ్యాపారం సాగిస్తే మంచిదని భావిస్తున్నారు. మార్చి నెలలో 35 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కావని, కానీ ఈసారి అందుకు విరుద్ధంగా ఎక్కువ టెంపరేచర్లు నమోదవుతుండటంతో మే నెలలో ఎంత స్థాయిలోవేడి తీవ్రత ఉంటుందన్నది అంచనాకు కూడా అందడం లేదు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశముందని, ప్రయాణాలు అత్యవసరంగా చేసేవారు రాత్రి వేళ చేయడం మేలన్న సూచనలు వెలువడుతున్నాయి.
Next Story