సూర్యుడి రహస్యాలు బయటపెట్టేస్తారా ..?
గంటకు ఏడు లక్షల కిలోమీటర్ల వేగం. సెకనుకు 200 కిలోమీటర్ల వేగం. ఏడేళ్ళ ప్రయాణం. పైగా వెళ్ళేది సూర్య మండలానికి. దానిపేరే పార్కర్ సోలార్ ప్రోబ్ శాటిలైట్. సూర్యుడి రహస్యాలు శోధించేందుకు రూపొందించిన ఈ రాకెట్ కి 150 కోట్ల డాలర్ల తో నాసా ప్రాజెక్ట్ కి వెచ్చించింది. సూర్యుడి సమీపంలోకి వెళ్ళడం అంటే నిప్పుల్లోకి వెళ్లడమే. అత్యంత రిస్క్ తో కూడుకున్న ఈ ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది నాసా. సౌర తుఫాన్ లు, అగ్ని జ్వాలలపై ఇతర కీలక అంశాలు ఈ శాటిలైట్ పరిశోధించి నాసా కు ఎప్పటికప్పుడు అందజేస్తుంది.
ఆయనకు అరుదైన గౌరవం ....
తొలి సారి జీవించి వున్న శాస్త్రవేత్త పేరును పార్కర్ ప్రోబ్ కి పెట్టడం విశేషం. అనేక ఏళ్ళుగా సూర్యుని పై పరిశోధనలు చేస్తున్న పార్కర్ ప్రోబ్ గౌరవార్ధం శాటిలైట్ కి ఈ నామకరణం చేసింది నాసా. ఫ్లోరిడా నుంచి నింగికెగసిన ఈ రాకెట్ అందించే విలువైన సమాచారం శాస్త్ర సాంకేతిక రంగాల తీరునే సమూలంగా మార్చనుంది. శాటిలైట్ కి అనేక ప్రత్యేకతలు వున్నాయి. 1500 లడిగ్రీల ఉష్ణోగ్రతను సైతం ఇది తట్టుకోగలుగుతుంది. శాటిలైట్ అంతర్గత ఉష్ణోగ్రత 29 డిగ్రీలు మాత్రమే ఉండటం దీని ప్రత్యేకత. ఖగోళ అద్భుతాల్లో ఒకటైన సూర్య గ్రహం రహస్యాలు వెల్లడైతే మానవాళి మొత్తానికి ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి.