వైఎస్ వివేకా హత్యపై ఆయన కూతురు కీలక వ్యాఖ్యలు
వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబసభ్యులే చంపారనేలా చంద్రబాబు సహా టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన కూతురు సునీతారెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. బుధవారం పులివెందులలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… [more]
వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబసభ్యులే చంపారనేలా చంద్రబాబు సహా టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన కూతురు సునీతారెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. బుధవారం పులివెందులలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… [more]
వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబసభ్యులే చంపారనేలా చంద్రబాబు సహా టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన కూతురు సునీతారెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. బుధవారం పులివెందులలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… తన తండ్రి చనిపోయే తాము బాధలో ఉంటే మీడియాలో వచ్చిన వార్తలు తమను మరింత క్షోభ పెడుతున్నాయని పేర్కొన్నారు. చనిపోయిన వ్యక్తి గురించి ఎవరూ చెడుగా మాట్లాడరని, కానీ నిరంతరం పులివెందుల ప్రజల కోసం బతికిన తన తండ్రి గురించి మీడియా, పత్రికలు తప్పుడు ప్రచారం చేయడం బాధ కలిగిస్తుందన్నారు. అధికారంలో ఉన్న పెద్ద మనుషులే హత్య ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో చెప్పేయడం సరికాదన్నారు. వారి మాటల ప్రభావం సిట్ విచారణపై పడదా అని ప్రశ్నించారు. కేసు విచారణలో ఉన్నందున తాము కూడా ఈ ఘటనపై మాట్లాడమన్నారు.
జగన్ ను ముఖ్యమంత్రిని చేయడమే ఆయన లక్ష్యం
కులమతాలకు అతీతమైన తమ కుటుంబంలో 700 మంది సభ్యులు ఉన్నామని, అందరం కలిసిమెలిసి ఉంటామన్నారు. ఏ కుటుంబంలో అయినా అభిప్రాయబేదాలు ఉంటాయని, ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవిస్తామన్నారు. అంతేకానీ మనుషులను చంపుకునే కుటుంబం తమది కాదన్నారు. ఇది అర్థం చేసుకోవాలంటే కొంత పెద్ద మనస్సు ఉండాలన్నారు. తన తండ్రికి పులివెందుల అన్నా, ఇక్కడి ప్రజలన్నా ఎంతో ఇష్టమన్నారు. జగన్ ను ముఖ్యమంత్రగా చూడాలన్నదే ఆయన కోరిక అని, ఇందుకోసం ఆయన చివరి వరకు అహర్నిషలు కష్టపడ్డారని పేర్కొన్నారు. తన తండ్రిపై, తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం మానుకోవాలని కోరారు. విచారణ సంస్థ ఏదైనా నిష్ఫక్షపాత విచారణ జరిపి అసలు దోషులు ఎవరో తేల్చాలన్నారు. తన తండ్రి చనిపోయారని తెలిసాక సన్నిహితులు ఇంటికి వచ్చారని, అంతమాత్రానికే వారే తప్పు చేశారని చెప్పడం సరికాదన్నారు. దోషులు ఎంత పెద్ద వారైనా శిక్ష పడాలన్నారు.