Fri Jan 10 2025 16:51:30 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తెలంగాణ సర్కార్ కి సుప్రీం షాక్
రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు మరో కీలక తీర్పును వెలువరించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 67 శాతానికి పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టును కోరింది. రాష్ట్రంలో బీసీ జనాభా అధికంగా ఉన్నందున ఈ అవకాశం ఇవ్వాలని కోరింది. అయితే, తెలంగాణ సర్కార్ అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని కోర్టు స్పష్టం చేసింది.
Next Story