బ్రేకింగ్ : విస్తృత ధర్మాసనానికి బదిలీ
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. అయితే శబరిమల అంశం మతానికి సంబంధించిందని, ప్రతి ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు [more]
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. అయితే శబరిమల అంశం మతానికి సంబంధించిందని, ప్రతి ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు [more]
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. అయితే శబరిమల అంశం మతానికి సంబంధించిందని, ప్రతి ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. శబరిమల అంశాన్ని విస్తృత ధర్మాసనానికి సుప్రీంకోర్టు నివేదించింది. ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనానికి శబరిమల అంశాన్ని బదిలీ చేసింది. మెజారిటీ జడ్జిల అభిప్రాయంతో జస్టిస్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్ లు విభేదించారు. మొత్తం ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ముగ్గురు మాత్రం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని నిర్ణయించగా, వీరిద్దరూ మాత్రం వ్యతిరేకించారు. దీనిపై పూర్తి అధ్యయనం తర్వాతనే తీర్పు వెలువరించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మహిళల ఆలయ ప్రవేశం కేవలం అయ్యప్ప ఆలయానికే పరిమితమైన సమస్య కాదని అభిప్రాయపడింది.