మోదీ ప్రభుత్వానికి మొట్టికాయలు
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో కరోనాతో అల్లకల్లోలంగా ఉన్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందని వ్యాఖ్యానించిదంి. ఆక్సిజన్ కొరత, మందుల కొరతపై కేంద్ర [more]
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో కరోనాతో అల్లకల్లోలంగా ఉన్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందని వ్యాఖ్యానించిదంి. ఆక్సిజన్ కొరత, మందుల కొరతపై కేంద్ర [more]
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో కరోనాతో అల్లకల్లోలంగా ఉన్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందని వ్యాఖ్యానించిదంి. ఆక్సిజన్ కొరత, మందుల కొరతపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎలాంటి చర్యలు తీసకుంటున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రజలు కరోనా తో అవస్థలు పడుతున్నా సరైన వైద్యం అందించకపోవడమేంటని సుప్రీంకోర్టు నిలదీసింది. దేశంలో నేషనల్ ఎమెర్జెన్సీ ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జాతీయ స్థాయిలో ఎటువంటి ప్రణాళికను రూపొందించారో నివేదిక ఇవ్వాలని కోరింది. మినీ లాక్ డౌన్ లాంటిది ఏమైనా ప్రకటిస్తారా? అని ప్రశ్నించింది.