Sun Jan 12 2025 13:06:14 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ... కేసీఆర్ రాజ్యమా..?
తెలంగాణను అడ్డుకున్న వారితో కలిసి టీఆర్ఎస్ పనిచేస్తోందని కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ఆరోపించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని, తన స్వంత రాజ్యంలా కేసీఆర్ పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ కోసం 2 వేల మంది వరకు ఆత్మబలిదానం చేసుకుంటే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం 400 మందిని మాత్రమే గుర్తించిందని అన్నారు. రాష్ట్రంలో బలిదానాలు చేసిన యువతను కూడా గుర్తించలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో యువకు ఉద్యోగాలు రాలేదు కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రం నలుగురికి ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ తో తమకు ఎటువంటి లోపాయికారీ ఒప్పందం లేదని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, అభివృద్ధి కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు.
Next Story