Wed Jan 15 2025 06:16:23 GMT+0000 (Coordinated Universal Time)
2019 ఎన్నికలపై సుష్మా స్వరాజ్ సంచలన ప్రకటన
2019 పార్లమెంటు ఎన్నికల్లో తాను పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నానని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కీలక ప్రకటన చేశారు. మధ్య ప్రదేశ్ లో మీడియాతో మాట్లాడుతూ... ఆరోగ్య కారణాల రిత్యా తాను ఇక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. తన కోసం తాను ప్రచారం చేసుకోలేనని పేర్కొన్నారు. అయితే, పార్టీ నిర్ణయానికి మాత్రం కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఏడుసార్లు ఎంపీగా పనిచేసిన సుష్మా స్వరాజ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని విదీశ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. 2016లో మధుమేహం కారణంగా ఆమె కొన్ని నెలల పాటు అధికారిక విధులకు కూడా దూరంగా ఉండల్సి వచ్చింది. తర్వాత 2016 డిసెంబరు 10న ఆమెకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా జరిగింది.
Next Story