Wed Dec 25 2024 08:19:54 GMT+0000 (Coordinated Universal Time)
నందిగం పై నిర్భయ కేసు నమోదు చేయండి
బాపట్ల పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ పై నిర్భయ కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. గుంటూరులో ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ ను [more]
బాపట్ల పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ పై నిర్భయ కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. గుంటూరులో ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ ను [more]
బాపట్ల పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ పై నిర్భయ కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. గుంటూరులో ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ ను టీడీపీ నేతలు వర్ల రామయ్య, జవహర్, నక్కా ఆనందబాబులు కలిశారు. రాజధాని కోసం ఉద్యమిస్తున్న మహిళలపై సురేష్ తో పాటు అతని అనుచరులు దాడికి దిగుతున్నారన్నారు. నందిగం సురేష్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. రాజకీయాలను వ్యాపారంగా మార్చి వివాదాలకు కారణమవుతున్నారని చెప్పారు. మహిళలపై ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేసిన నందిగం సురేష్ పై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.
Next Story