Sun Feb 16 2025 06:45:06 GMT+0000 (Coordinated Universal Time)
పెద్దమెంటల్ కేసులా ఉందే
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి రాను రాను కామెడీ షోను తలపిస్తుంది.
![jc prabhakar reddy , municipal chairman, RTPP flyash jc prabhakar reddy , municipal chairman, RTPP flyash](https://www.telugupost.com/h-upload/2023/04/30/1496553-jc-prabhakar-reddy-3.webp)
రాను రాను తాడిప్రతి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా ప్రత్యర్థుల గురించి విమర్శలు చేయవచ్చు. ఆందోళనలూ చేయవచ్చు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి స్టయిలే వేరు. గతంలో మాదరి కాదు. భాష మారకపోయినా ఇటీవల కాలంలో వేషం మార్చారు. స్టయిల్నూ పూర్తిగా మార్చేశారు. మొన్నా మధ్య లోకేష్ పాదయాత్ర చేస్తూ కాళ్లకు బొబ్బలు లేచాయంటూ పెడ బొబ్బలు పెట్టారు. చూసే వారికి అద ఏడుస్తున్నట్లు లేదు. నాటకంలాగానే కనిపించింది. ఎందుకింత డ్రామాలు అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు సయితం వెటకారాలు చేశారు.
ఆందోళన చేసినా...
మూడు రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇసుక తవ్వకాలు జరిపితే ట్రాక్టర్లను, లారీలను తగులబెడతానని హెచ్చరించారు. మామూలుగా ఇసుక తరలింపునకు వ్యతిరేకంగా ధర్నా చేయవచ్చు. ఆందోళనకు దిగవచ్చు. అందుకు ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం తగులబెడతానని హెచ్చరించడంతోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్దనే కాలకృత్యాలు చేస్తూ జనం నోటిలో నానేందుకు జేసీ ప్రయత్నించారన్న విమర్శలనూ ఎదుర్కొన్నారు.
తాజాగా డీజిల్ దొంగ అంటూ...
ఇక తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి డీజిల్ దొంగ ఎవరు అంటూ ఆందోళనకు దిగారు. తాడిపత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి డీజిల్ దొంగ అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగితే బాగుండేది. అలా ఆగి ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలా అవుతారు? అందుకే ఆయన ఓ వైరైటీ నిరసన తెలియజేశారు. తన గుండెల నిండా తాడిపత్రి జనం ఉన్నారని, జనం గుండెల్లో తాను ఉన్నానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తన గుండెపై పచ్చబొట్టులా పొడిపించుకుని మరీ మీడియా ఎదుట ప్రదర్శనకు దిగారు. ఇది అతి కాక ఇంకేముంటుంది? అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
ఏవగింపు కలిగేలా....
అంతకు ముందు కూడా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ను ఎమ్మెల్యే హోదాలో జేసీ ప్రభాకర్ రెడ్డి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. రాయలేని భాషలో అనడం తాడిపత్రి వాసులకే కాదు.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ జేసీ అంటేనే ఏవగింపుకలిగేలా చేసుకున్నారు. దాని ఫలితమే తాడిపత్రి నియోజకవర్గంలో పట్టున్న జేసీ కుటుంబం తొలిసారి 2019 ఎన్నికల్లో ఓటమిని చవి చూసింది. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్లుగా మున్సిపాలిటీలో గెలిచినా ఆ "వేషాలు" మానుకోలేదు. కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. నిజానికి ప్రజల గుండెల్లో ఉంటే జేసీ కుటుంబాన్ని వచ్చే ఎన్నికల్లో ఆటోమేటిక్ గా ప్రజలే గెలిపించుకుంటారు. అంతే తప్ప ఇలాంటి వేషాలు వేయడం వల్ల ఉపయోగం లేదన్న కామెంట్స్ వినపడుతున్నాయ.
Next Story