తారా మళ్లీ వచ్చిన వేళ....!!
నటి తారా చౌదరి మళ్లీ తెరమీదకు వచ్చింది. ఇండ్రస్టీతో పాటుగా పోలీసులను ఆడుకున్న తారా చౌదరి ఇప్పడు మరొక సారి వార్తల్లోకి ఎక్కింది. ఈ సారి తారా చేస్తున్న వ్యాఖ్యలు ఎటు వైపు వెళతాయో తెలియని స్దితి. తనను పోలీసులతోపాటుగా తన బావ మోసంచేశాడని చెప్పి అంటుంది తారా చౌదరి.
గతంలో రాజకీయ నేతలపైనా...
నటీ తారా చౌదరి గతంలో రాజకీయ నాయకులతోపాటుగా పోలీసుల మీద కామెంట్లు చేసి సంచలనం సృష్టించింది. అలాగే రాజకీయ నాయకులతో సంబంధాలను కూడా బయట పెట్టింది. . అలాగే తనను ఇబ్బంది పెట్టిన పోలీసుల మీద ఆపరేషన్లుచేసి బయట పెట్టింది. అలాంటి తారా చౌదరి ఇప్పడు కుటుంబ సమస్యల్లో కూరుకుని పొయింది.
బావతో నిశ్శితార్థం.....
కొన్నాళ్ల క్రితం తారా చౌదరికి తన బావతో నిశ్చితార్థం అయ్యింది. ఆంధ్రాలో వుంటే బావ రాజ్ కూమార్ తో నిశ్చితార్థం అయ్యింది. ఆ తరువాత త్వరలోనే వివాహం అంటూ ప్రకటించారు. అయితే నిశ్చితార్థం అయిన తరువాత కొన్నాళ్లకు తనను వివాహం చేసుకోనని తన బావ చెప్పాడని తారా అంటుంది. అయితే ఎందుకు వివాహం చేసుకొవని అడిగితే బావ కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తారని తెలిపింది. గతకొన్ని నెలలుగా బావను బతిమాలినా వివాహానికి ఒప్పుకోలేదని. కుటుంబ సభ్యులను కూడా చెప్పిన వినిపించుకొలేదని తారా అంటుంది.దీంతొ తనకు న్యాయం చేయాలని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించానని తెలిపింది. పోలీసులు కూడా తనను బెదరిస్తున్నారని తెలిపింది.తారా చౌదరీ ఇచ్చిన ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు