Mon Dec 23 2024 18:13:37 GMT+0000 (Coordinated Universal Time)
నా నియోజకవర్గానికి నన్ను వెళ్లనివ్వరా?
చంద్రబాబు పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తాను రోడ్ షో జరిపి తీరుతానని చంద్రబాబు తెలిపారు.
కుప్పంలో ఉద్రిక్తత పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. ఉదయం నుంచి టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. బెంగళూరు విమానాశ్రయంలో దిగిన చంద్రబాబు కేజీఎఫ్, పెద్దూరు మీదుగా కుప్పం చేరుకుంటున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. నీలగిరిపల్లి వద్ద చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసు అధికారులు ప్రయత్నించారు. రోడ్ షో, బహిరంగ సభలకు అనుమతి లేదని వారు చెప్పారు.
పోలీసులతో వాగ్వాదం...
ఈ సందర్భంగా చంద్రబాబు పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తాను రోడ్ షో జరిపి తీరుతానని చంద్రబాబు తెలిపారు. పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు పెద్దయెత్తున నినాదాలు చేశారు. రోడ్ షోకు ఎందుకు పర్మిషన్ ఇవ్వరని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంతమంది ప్రజలను ఇబ్బంది పెడతారా? అని ఆయన పోలీసు అధికారులను నిలదీశారు. ప్రభుత్వ జీవో ప్రకారం ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకోవచ్చి చంద్రబాబు అనగా, మైకుకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. నా నియోజకవర్గానికి నేను వెళ్లొద్ద అని సీరియస్ అయ్యారు చంద్రబాబు. పోలీసులు మాత్రం రోడ్ షోకు అనుమతించేది లేదని చెప్పడంతో టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ప్రస్తుతం పెద్దూరు వద్ద ఉద్రిక్తత కొనసాగుతుంది.
Next Story