Mon Dec 23 2024 03:28:09 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : రాజమండ్రి టు ఉండవల్లి...13 గంటల ప్రయాణం
టీడీపీ చీఫ్ చంద్రబాబు నిన్న సాయంత్రం 4.30 గంటలకు రాజమండ్రిలో బయలుదేరి నేటి ఉదయం ఐదు గంటలకు ఉండవల్లి చేరుకున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం 4.30 గంటలకు రాజమండ్రిలో బయలుదేరి నేటి ఉదయం ఐదు గంటలకు ఉండవల్లి చేరుకున్నారు. ఆయన దాదాపు పదమూడు గంటల పాటు రాజమండ్రి నుంచి విజయవాడకు ప్రయాణం చేశారు. అడుగడుగునా ప్రజలు వేచి ఉంచి చంద్రబాబుకు హారతులు పట్టారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబును చూసేందుకు దారిపొడవునా పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేచి ఉన్నారు.
పూలు పర్చి...
అందరికీ అభివాదం చేస్తూ పలకరించుకుంటూ వచ్చే సరికి పదమూడు గంటల సమయం పట్టింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న వెంటనే ఆయన సతీమణి భువనేశ్వరి హారతినిచ్చి స్వాగతం పలికారు. గుమ్మడి కాయతో దిష్టి తీశారు. అమరావతి రాజధాని రైతులు కూడా తెల్లవారు జాము వరకూ వేచి ఉండి చంద్రబాబుకు స్వాగతం పలికారు. కరకట్ట నుంచి చంద్రబాబు నివాసం వరకూ రైతులు పూలతో బాటను ఏర్పాటు చేశారు. వేలాది మంది ప్రజల ఆశీర్వాదాల మధ్య 52 రోజుల తర్వాత ఆయన తన నివాసంలోకి అడుగు పెట్టారు.
Next Story