Thu Dec 26 2024 13:24:18 GMT+0000 (Coordinated Universal Time)
బాబు ఉంగరం.. వీడిన సస్పెన్స్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వేలికున్న ఉంగరం రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది. అయితే దీనిపై సస్పెన్స్ వీడిపోయింది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వేలికున్న ఉంగరం రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది. ఆయన ఎప్పుడూ ఆర్భాటాలకు, హంగులకూ దూరంగా ఉంటారు. అలాంటిది ఆయన చూపుడు వేలుకు ఉన్న ఉంగరం అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. చంద్రబాబు జ్యోతిష్యాలకు కూడా దూరంగా ఉంటారని చెబుతారు. అయితే వయసు పెరిగే కొద్దీ జ్యోతిష్యాన్ని నమ్మి ఉంగరాన్ని చంద్రబాబు ధరించారేమో నన్న అనుమానం అందరిలోనూ వ్యక్తమయింది.
సీనియర్ నేతలు...
నేతలు గమనించినా చంద్రబాబును అడిగే ధైర్యం చేయలేక పోయారు. అడిగితే చంద్రబాబు నుంచి ఏం సమాధనమొస్తందోనని సీనియర్ నేతలు సయితం చూసీ చూడనట్లు వ్యవహరించారు. అయితే చంద్రబాబు ఉంగరంపై సస్పెన్స్ తొలిగింది. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం సమీక్ష సందర్భంగా కొందరు కార్యకర్తలు చంద్రబాబును నేరుగా ప్రశ్నించారు. "సార్ మీ వేలికి ఉంగరం ఎందుకు పెట్టుకున్నారు. గతంలో లేదు. జ్యోతిష్యుడు చెప్పారా" అని చంద్రబాబును కార్యకర్తలు అడిగారు.
వైద్యుల సూచనల మేరకు..
అయితే అందుకు నవ్విన చంద్రబాబు వైద్యుల సూచన మేరకే వేలికి ఉంగరం తొడిగానని బదులిచ్చారు. ఈ ఉంగరంలో కంప్యూటర్ చిప్ ఉందని చెప్పారు. అది తన గుండె వేగాన్ని, నిద్రిస్తున్న తీరును నమోదు చేస్తుందని తెలిపారు. మరుసటి రోజు విశ్లేషించుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటానని ఆయన వివరించారు.అందుకే తాను చూపుడు వేలుకు పెట్టుకున్నాననిని కార్యకర్తలకు వివరించారు. దీంతో చంద్రబాబు వేలికున్న ఉంగరం సస్పెన్స్ వీడిపోయినట్లయింది. అందుకే ఆయన చూపుడు వేలుకు పెట్టుకున్నారని కార్యకర్తలు సయితం
Next Story