Sat Dec 21 2024 06:03:44 GMT+0000 (Coordinated Universal Time)
Badvel : బద్వేలు ఎన్నిక ఏకగ్రీవానికి టీడీపీ సహకారం
బద్వేలు ఉప ఎన్నికకు టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బద్వేలు ఉప ఎన్నిక [more]
బద్వేలు ఉప ఎన్నికకు టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బద్వేలు ఉప ఎన్నిక [more]
బద్వేలు ఉప ఎన్నికకు టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బద్వేలు ఉప ఎన్నిక విషయంపై పొలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. సంప్రదాయాలను గౌరవించాలన్న మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు బద్వేలు ఉప ఎన్నిక నుంచి తప్పుకుంటున్నట్లు టీడీపీ ప్రకటించింది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మృతి చెందిన ఎమ్మెల్యే సతీమణి పోటీ చేస్తుండటంతో విలువలను పాటిస్తూ తాము బరి నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. దీంతో చంద్రబాబు సయితం పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లే.
Next Story