Fri Nov 29 2024 17:30:48 GMT+0000 (Coordinated Universal Time)
పార్టీకి పాతర వేసినట్లేనా?
తెలంగాణలో టీడీపీకి సరైన నాయకత్వం లేదు. ఇప్పటి వరకూ ఉన్న ఓటు బ్యాంకు కూడా ఇప్పుడు లేకుండా పోయింది
తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏంటి? అక్కడ ఈసారి ఎన్నికల వ్యూహమేంటి? అన్నది చంద్రబాబుకు కూడా అర్ధం కాకుండా ఉంది. తెలంగాణలో సరైన నాయకత్వం లేదు. ఇప్పటి వరకూ ఉన్న ఓటు బ్యాంకు కూడా ఇప్పుడు లేకుండా పోయింది. కేవలం రెండు, మూడు నియోజకవర్గాలు తప్పించి తెలంగాణలో ఎక్కడా టీడీపీ బలంగా లేదు. అయినా చంద్రబాబు జాతీయ పార్టీగా టీడీపీని ఫోకస్ చేయడం కోసం తెలంగాణలో పార్టీని 2018 ఎన్నికల తర్వాత నుంచి ఉంచారు. ఎల్. రమణ పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఏదో నామమాత్రంగా పార్టీని అక్కడ ఉంచారు తప్ప దానిపై ఎలాంటి దృష్టి పెట్టడం లేదు. మహానాడులో కూడా తెలంగాణకు పెద్దగా ప్రాధాన్యత దక్కేలేదు.
ఎలాంటి కార్యక్రమాలు...
ఇక టీడీపీ కార్యక్రమాలు తెలంగాణలో పెద్దగా జరిగింది లేవు. జరుగుతున్నదీ లేదు. ఇక్కడ అసలు ఆ పార్టీ ఉన్న దాఖలాలు కూడా లేవు. ఇక టీడీపీ ఓటు బ్యాంకు ఇప్పటికే రాజకీయ పార్టీలకు టర్న్ అయిపోయాయి. ఓటు బ్యాంకుతో పాటు ముఖ్యమైన నేతలందరూ ఇతర పార్టీలకు జంప్ అయ్యారు. కొద్దో గొప్పో ఉన్న నేతలు కూడా కేవలం ఏ పార్టీలో చోటు లేకనే ఇక్కడ ఉంటున్నారు తప్పించి, టీడీపీ బలోపేతం అవుతుందని, ఇక్కడేదో సాధిస్తామన్న ధ్యాస ఉన్న వారిలో లేదు. నేతలు విజిటింగ్ కార్డు కోసమే కొందరు నేతలు కొనసాగుతున్నారు.
పూర్తిగా ఏపీపైనే....
ఇక చంద్రబాబు కూడా పెద్దగా తెలంగాణ టీడీపీని పట్టించుకోవడం లేదు. ఆయనకు తొలుత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ విజయం ముఖ్యం. అక్కడ పార్టీ బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావడానికి తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఆయన భవిష్యత్ లో తెలంగాణపై దృష్టి పెట్టే అవకాశమూ లేదు. ఏపీ కంటే తెలంగాణ ఎన్నికలు ముందు వస్తాయి. ఒక ఏడాది ముందు వస్తున్న ఎన్నికలకు ఇక్కడ నేతలకు చంద్రబాబు ఇప్పటి వరకూ దిశానిర్దేశం చేయలేదు. జాతీయ పార్టీగా ఉండాలని అనుకుంటున్నందున ఈసారి కొద్ది స్థానాల్లో పోటీ చేసే అవకాశముంది. అంతే తప్ప ఇక్కడ పెద్దగా ఆయన కసరత్తు చేసే అవకాశమూ కన్పించడం లేదు. అంత ఓపికా, అంత సమయమూ చంద్రబాబుకు లేదు.
కాంగ్రెస్ తో కలిసేందుకు....
పోనీ తెలంగాణ టీడీపీ బాధ్యతను మరెవరికైనా అప్పగించాలన్న ప్రతిపాదనను కూడా ఆయన అంగీకరించడం లేదు. 2018 ఎన్నికల్లో చేసిన తప్పును మాత్రం ఆయన మరొకసారి చేయరు. కాంగ్రెస్ తో కలసి పోటీకి దిగే అవకాశమూ కన్పించడం లేదు. బీజేపీతో సయోధ్య కుదిరితే మాత్రం అక్కడ పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయి. కానీ అది ఎంతవరకూ సాధ్యమన్నది ఇప్పుడే చెప్పలేం. తెలంగాణలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలంటే డబ్బులు అవసరం. ఇక్కడ ఖర్చు పెడితే నీళ్లలో పోసినట్లేనని ఆయనకు తెలియంది కాదు. ఇక్కడి నేతలు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చి ఒక్క మీటింగ్ లేదు. ఒక్క సమీక్ష లేదు. దీంతో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందా? లేదా? అన్నది కూడా ఆ పార్టీ నేతల్లో క్లారిటీ లేదు. ఏమీ లేని దానికి బరిలోకి దిగి ఓడిపోయేదెందుకున్న రీతిలో తెలంగాణ టీడీపీ నేతలున్నారు. ఉన్న కొద్దిమంది కూడా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని వీడే అవకాశాలు కన్పిస్తున్నా
Next Story