Thu Jan 16 2025 10:48:30 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ నేత ఆందోళన
తెలంగాణలో పొత్తుల లొల్లి టీడీపీలోనూ ప్రారంభమైంది. ఎల్బీనగర్ సీటును టీడీపీకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఎల్బీనగర్ సీటును కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి కేటాయిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఇప్పటికే ప్రచారం కూడా చేస్తున్న సామ రంగారెడ్డి అమీతుమీ తేల్చుకోవాలని తన క్యాడర్ తో కలిసి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి వెళ్లారు. టీడీపీ సిట్టింగ్ స్థానమైన ఎల్బీనగర్ ను ఈ ఎన్నికల్లో టీడీపీకే కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆయనతో పాటు కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
Next Story