Mon Jan 13 2025 02:46:07 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ ఎంపీలు... ఆంధ్రా మాల్యాలు
తెలుగుదేశం పార్టీలు ఆంధ్రా విజయ్ మాల్యాలుగా మారారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. సుజనా చౌదరి అధికార ముసుగులో వేల కోట్లు కొల్లగొట్టారని, టీడీపీ ఎంపీలు కొల్లగొట్టిన సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ - టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని, బీజేపీనే ప్రత్యామ్నాయమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాకుండా చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. అయితే, రాహుల్ గాందీ, చంద్రబాబు ఆడుతున్న సమిష్టి నాటకం అడుతున్నారని, తాము చట్టంలో లేకపోయినా ఏపీకి ప్యాకేజీ ఇచ్చామని గుర్తు చేశారు.
Next Story