చరిత్ర సృష్టించిన టీమిండియా
టీమిండియా అడిలైట్ టెస్టు విజయంతో చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాలో తొలిసారిగా సిరీస్ లో మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. చివరగా 2008లో పెర్త్ లో భారత్ టెస్ట్ మ్యాచ్ గెలుపొందింది. దీంతో పాటు పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో భారత్ టెస్ట్ మ్యాచ్ నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 31 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను భారత్ ఓడించి నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యత సాధించింది. ఈ మ్యాచ్ లో విజయం కోసం 323 పరుగులు చేయాల్సిన ఆస్ట్రేలియా 291 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు బూమ్రా, అశ్విన్, షమి తలా మూడు విక్కెట్లు సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదటి ఇన్నింగ్స్ లో 123, రెండో ఇన్నింగ్స్ లో 71 పరుగులు చేసి ఛటేశ్వర్ పుజారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నారు. ఇక భారత విక్కెట్ కీపర్ పంత్ 11 క్యాచ్ లు అందుకుని డివిలియర్స్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డుని సమం చేశాడు.