Mon Dec 23 2024 11:47:49 GMT+0000 (Coordinated Universal Time)
క్రికెటర్ అక్షర్ పటేల్ ఎంగేజ్ మెంట్.. వెల్లువెత్తిన విషెస్
టీమిండియా క్రికెటర్, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. జనవరి 20వ తేదీన (నిన్న) అక్షర్ పటేల్ తన 28వ జన్మదిన వేడుకలను జరుపుకున్నాడు. అయితే ఎప్పటిలా పుట్టినరోజు వేడుకలే కాకుండా.. తన ప్రియురాలితో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నాడు. ప్రియురాలు మేహాతో అక్షర్ పటేల్ కు గురువారం నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అక్షర్ తన ఇన్ స్టా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
అక్షర్ బర్త్ డే, ఎంగేజ్ మెంట్ ఒకేరోజు కావడంతో సోషల్ మీడియాలో అతనికి విషెస్ వెల్లువెత్తాయి. సహచరుడు యుజ్వేంద్ర చాహల్ సహా పలువురు క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలతో ఇన్స్టాగ్రామ్ను మోతెక్కించారు. అక్షర్ నిశ్చితార్థం విషయాన్ని తొలుత అతడి గుజరాత్ టీమ్మేట్ చింతన్ గాజా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అక్షర్-మేహ నిశ్చితార్థం ఫొటోలను షేర్ చేశాడు. అక్షర్ మోకాళ్లపై నిల్చుని ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఉన్న ఆ ఫోటోలో.. బ్యాక్ గ్రౌండ్ లో లవ్ సింబల్, మ్యారీ మీ అనే అక్షరాలు కనిపించాయి. ప్రస్తుతం ఈ ఎంగేజ్ మెంట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Next Story