ఇండియాతో అంత ఈజీ కాదు..!
తడబడుతూ తొలి అడుగులు.. కెప్టెన్ తప్ప అర్థ శతకం కొట్టిన వాళ్లెవరూ లేరు. ఓ దశలో వరుసగా పడిపోతున్న వికెట్లు. 220 దాటడానికి ఆపసోపాలు. అరవీర భయంకరమైన టీం ఇండియా ఆదివారం నాటి పరిస్థితి. ప్రపంచ కప్ ఐదు మ్యాచ్‌ల్లోనూ సరిలేరు నీకెవ్వరూ అనిపించుకున్న భారత క్రికెట్ జట్టు, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మాత్రం తొలుత తడబడింది.
తడబడుతూ తొలి అడుగులు.. కెప్టెన్ తప్ప అర్థ శతకం కొట్టిన వాళ్లెవరూ లేరు. ఓ దశలో వరుసగా పడిపోతున్న వికెట్లు. 220 దాటడానికి ఆపసోపాలు. అరవీర భయంకరమైన టీం ఇండియా ఆదివారం నాటి పరిస్థితి. ప్రపంచ కప్ ఐదు మ్యాచ్‌ల్లోనూ సరిలేరు నీకెవ్వరూ అనిపించుకున్న భారత క్రికెట్ జట్టు, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మాత్రం తొలుత తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయి, పరుగులు రాబట్టడానికి ఇబ్బంది పడిన ఇండియా, రోహిత్`సూర్యకుమార్ భాగస్వామ్యంలో కోలుకున్నట్లు కనిపించినా... చివరిలో మాత్రం మళ్లీ వెనుకడుగు వేసింది. 270 వరకూ స్కోర్ చేయగలదని భావించినా.. 229 వద్దే ఆగిపోయింది.
230 పరుగుల లక్ష్యం స్వల్పమే కాబటి, ఇంగ్లండ్ గెలుపు సునాయాసమేనని అభిమానులు భావించారు. తొలుత నాలుగు ఓవర్లలో ముప్పయ్ పరుగులు రాబట్టిన ఇంగ్లండ్ క్రికెటర్లు కూడా... తమ విజయం లాంఛనప్రాయమేనని ఫిక్స్ అయిపోయారు. కానీ బుమ్రా వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి బ్రిటిషర్లకు గట్టి దెబ్బ కొట్టాడు. పది పరుగులు వ్యవధిలో షమీ మరో రెండు వరుస వికెట్లు తీసి ఇంగ్లండ్ వెన్ను విరిచాడు. నాలుగు వికెట్లు కోల్పోయినా, ఇంగ్లండ్ టీం కాస్త కుదురుకోడానికి ప్రయత్నించింది. కుల్దీప్ ఐదో వికెట్ తీయగా, షమీ మళ్లీ బౌలింగ్‌కు వచ్చి ఆరో వికెట్‌ను పడగొట్టాడు. వోక్స్ పది పరుగులు చేసి లివింగ్ స్టోన్‌తో కలిసి భాగస్వామ్యాన్ని నిర్మించే ప్రయత్నం చేశాడు. ఊరించే బాల్‌తో వోక్స్‌ను స్టంప్ అవుట్ చేసి జడేజా తన తొలి వికెట్‌ను సాధించాడు. కుల్దీప్ లివింగ్ స్టోన్ ని ఎనిమిదో వికెట్ రూపం లో పెవిలియన్ కి పంపి ఇంగ్లాండ్ టీం ని మరిన్ని కష్టాల్లోకి నెట్టాడు. తర్వాత షమీ ఒకటి బుమ్రా మరో వికెట్ తీసి 100 పరుగుల తేడాతో ఇండియా ని గెలిపించారు.
ఈ మ్యాచ్ గెలుపుతో టీం ఇండియా వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలుపొందింది. దక్షిణాఫ్రికా మాత్రమే మనకు రాబోయే ఆటలో మనకు గట్టిగా పోటీ ఇవ్వగలుగుతుంది. బంగ్లా, శ్రీలంక జట్లు, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, ఇండియా ధాటి ముందు నిలబడే పరిస్థితి లేదు. భారీ స్కోర్ ఛేదించడం, తక్కువ స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవడం ద్వారా.. ఇండియాతో క్రికెట్ అంత ఈజీ కాదనే విషయం మాత్రం ప్రపంచానికి బాగా అర్థమవుతోంది.