అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. రాయలసీమ?
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఈ సమావేశాల్లో చర్చకు రానుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం [more]
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఈ సమావేశాల్లో చర్చకు రానుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం [more]
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఈ సమావేశాల్లో చర్చకు రానుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయనున్నారు. దీంతో పాటు కరోనా వ్యాప్తిపై కూడా సమావేశాల్లో చర్చించనున్నారు. జీఎస్టీ అమలులో రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై చర్చించి ఈ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. దీంతో పాటు కొత్త రెవెన్యూ చట్టంపై కూడా చర్చించి శాసనసభ ఆమోదం తెలపనుంది. శాసనసభ సమావేవాలు దాదాపు 20 రోజుల పాటు జరగనున్నాయి. సభ్యులు భౌతిక దూరం పాటిస్తూ సభలో పాల్గొననున్నారు. కోవిడ్ పరీక్షలు చేసి నెగిటివ్ వచ్చిన వారినే శాసనసభలోకి అనుమతిస్తారు.