Sun Dec 29 2024 03:08:08 GMT+0000 (Coordinated Universal Time)
మహేష్ బాబుకు కేసీఆర్ పరామర్శ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. నానక్ రామ్ గూడ లోని ఆయన నివాసానికి వచ్చి నివాళులర్పించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన కూర్చుని ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని ఆయన కృష్ణ కుటుంబ సభ్యులతో చెప్పారు.
మంచి మిత్రుడు...
తనకు కృష్ణ మంచి మిత్రుడని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తాను కృష్ణ నివాసానికి ఎన్నోసార్లు వచ్చానని తెలిపారు. ఆయన అల్లూరి సీతారామరాజు సినిమా అనేక సార్లు చూశానని అన్నారు. దేశభక్తి కలిగిన కృష్ణకు ఆత్మశాంతి కలగాలని ప్రార్ధిస్తున్నానని కేసీఆర్ తెలిపారు.
Next Story