నిరుద్యోగులకు కేసీఆర్ భారీ నజరానా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో బిగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఉద్యోగాల నియామకాలపై ఆయన ప్రకటన చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో బిగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఉద్యోగాల నియామకాలపై ఆయన ప్రకటన చేశారు. రాష్ట్రంలో 91,147 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. పోలీసు శాఖలో 18,334, విద్యా శాఖలో 13,086, వైద్య ఆరోగ్య శాఖలో 12,755, ఉన్నత విద్యాశాఖలో 7,878, రెవెన్యూ శాఖలో 3,560, బీసీ సంక్షేమ శాఖలో4,311, సాగునాటీ శాఖలో 2,622, ఎస్సీ సంక్షేమ శాఖలో 2,879 ఖాళీలున్నాయని చెప్పారు. 11,103 కాంటాక్టు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఈరోజు నుంచి 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలవుతాయని చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానికులకు ఉద్యోగ నియామకాల్లో ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఇకపై కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు ఉండవని కేసీఆర్ చెప్పారు. దీనివల్ల ఏటా ప్రభుత్వంపై ఏడు వేల కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. ఉద్యోగాల నియామకానికి పదేళ్లు వయసు ను పెంచుతున్నట్లు తెలిపారు. గ్రూప్ వన్ , గ్రూప్ టూ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పారు.
- Tags
- kcr
- notifications