Mon Dec 23 2024 16:06:00 GMT+0000 (Coordinated Universal Time)
ఫాం హౌస్ లో మంత్రులతో కేసీఆర్ అత్యవసర భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో భేటీ కాబోతున్నారు. అత్యవసరంగా భేటీకి రావాలని మంత్రులకు ఆహ్వానం అందింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మంత్రులతో భేటీ కాబోతున్నారు. అత్యవసరంగా భేటీకి రావాలని మంత్రులకు ఆహ్వానం అందింది. ప్రస్తుతం ఎర్రవెల్లి ఫాం హౌస్ లో కేసీఆర్ ఉన్నారు. మంత్రులను కూడా అక్కడికే రావాల్సిందిగా ఆహ్వానం అందింది. దీంతో హుటాహుటిన మంత్రులు మొత్తం ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ కు బయలుదేరారు.
అందుకేనా?
మంత్రులను అత్యవసరంగా కేసీఆర్ పిలవడంపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ మంత్రులను ఆహ్వానించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రితో భేటీకి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ హాజరయ్యారు. ఇప్పటికే మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస గౌడ్ తదితులు ఫాం హౌస్ కు చేరుకున్నారు. కాగా ముగ్గురు మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదు. పువ్వాడ అజయ్ ఖమ్మం పర్యటనలోనూ, నిరంజన్ రెడ్డి మహారాష్ట్ర, కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు.
- Tags
- kcr
- cabinet meet
Next Story